హైదరాబాద్ వర్షాలు : తెరిచి ఉన్న డ్రైనేజీలో పడి చిన్నారి మృతి.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి..

తెల్లవారుజామును మొదలైన వర్షాలు ఓ చిన్నారిని బలి తీసుకున్నాయి. డ్రైనేజీలో పడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి చెందింది. 

Hyderabad rains : Child dies after falling into open drainage - bsb

హైదరాబాద్ : జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలయ్యింది. తెరిచి ఉన్న డ్రైనేజీలో పడి ఓ చిన్నారి మృతి చెందింది.  కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం అని బయటికి బాలిక బయటికి వచ్చింది. డ్రైనేజీ మూత తెరిచి ఉండడంతో అందులో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని  డిఆర్ఎఫ్ సిబ్బంది కనిపెట్టారు. మృతురాలు నాలుగవ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. 

మోకాలు లోతు నీళ్లు ఉండడంతో డ్రైనేజీ తెరిచి ఉండడం గమనించడం లేదు. ఉదయాన్నే వర్షం భారీగా పడడంతో నిలిచిన నీరును తొలగించడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచారు. తమ్ముడితో పాటు పాల ప్యాకెట్ తీసుకురావడానికి బైటికి వచ్చింది మౌనిక.తమ్ముడు హ్యాండీక్యాప్.. తమ్ముడు నీళ్లలో పడిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో తమ్ముడిని కాపాడి, ఆ చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. కాస్త దూరంలో ఉన్న నాలాలో చిన్నారి మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. పాప తల్లిదండ్రులు అధికారుల మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios