తెలుగు నాట ‘‘ఈ - స్టోర్స్’’ పేరుతో ఘరానా మోసం.. 300 మంది బాధితులు, రూ.1000 కోట్లు కుచ్చుటోపీ
ఈ స్టోర్స్ పేరుతో జనానికి రూ.1000 కోట్లు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. వీరి వలలో చిక్కి 300 మందికి పైగా బాధితులు నిండా మునిగిపోయారు. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.ఆరున్న కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు.
తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్టోర్స్ సూపర్ మార్కెట్ పేరుతో భారీగా జనానికి టోకరా వేశారు కేటుగాళ్లు. నెలకు లక్ష లాభం ఇస్తామంటూ జనం దగ్గరి నుంచి రూ.1000 కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు. అలా ఒక్క హైదరాబాద్‌లోనే రూ.ఆరున్న కోట్లు వసూలు చేశారు. మొత్తం 300 మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు అంచనా. ఈ కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా ఈ స్టోర్స్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ స్టోర్స్ అనేది చట్టవిరుద్ధమైన వ్యాపారమని.. మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీల జోలికి వెళ్లొద్దని సీపీ ప్రజలను కోరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.