హైదరాబాద్‌లో కొత్త రకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్ నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు.
హైదరాబాద్‌లో కొత్త రకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్ నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. బ్యాంకు యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా.. సెక్స్ రాకెట్ కోసం ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే విటులను సెక్స్ వర్కర్లను కలిసేందుకు నిర్వాహకులు అనుమతిస్తారు. ఈ రకమైన దందా వెలుగుచూడంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. అయితే ఈ సెక్స్ రాకెట్‌లో ఉగాండా దేశీయులతో పాటు ఉన్నవారు వీఐపీలేనని తెలుస్తోంది.
ఈ ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెక్స్ రాకెట్ నిర్వాహకులు.. ఓ ప్రత్యేక వ్యవస్థను రూపొందించుకుని దందా సాగిస్తున్నారు. సాధారణంగా సీక్రెట్ కోడ్‌లను డేటా ట్రాన్స్‌ఫర్, డేటాను షేరింగ్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయడానికి వినియోగిస్తున్నారు. కానీ పోలీసుల డెకాయ్ ఆపరేషన్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు.. కస్టమర్ ఆథెంటికేషన్ కోసం సెక్స్ రాకెట్ నిర్వాహకులు సీక్రెట్ కోడ్‌లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు వారికి అందిన చిన్నపాటి సమాచారం ఆధారంగా.. ఒక ఫ్లాట్‌పై దాడి చేశారు. అక్కడ నలుగురు ఉగాండా జాతీయులను కనుగొన్నారు. వారిలో ముగ్గురు సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. ఒక డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్, నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ సంప్రదింపులు అనంతరం వారు ఫోన్ నెంబర్లను షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌లో తదుపరి సంభాషణలు కొనసాగాయి.
కస్టమర్ డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన తర్వాత.. ఒక ఫ్లాట్‌లోని మహిళ వద్దకు వెళ్లేందుకు కోడ్‌ను షేర్ చేశారు. కస్టమర్ అక్కడి వెళ్లి సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేసిన అతను మహిళతో సెక్స్ చేయడానికి గదిలోకి ప్రవేశించడానికి అనుమతించబడ్డాడు. ఆ తర్వాత నిర్వాహకులు కస్టమర్ మొబైల్ ఫోన్ నుంచి వారి సంప్రదింపు వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. తద్వారా కస్టమర్ ఆ డేటాను దుర్వినియోగం చేయడం లేకుండా.. పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు సెక్స్ రాకెట్ నిర్వహకులు ఈ విధమైన చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుంది ఉగాండా మహిళ అని, ఆమెతో పాటు కస్టమర్‌ను నిందితులుగా చేర్చినట్టుగా పోలీసులు చెప్పారు. కస్టమర్లను ఆకర్షిస్తున్న ఉగాండాకు చెందిన మరో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.