సోదరిని లైంగికంగా వేధించిన యువకుడిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.  సోషల్ మీడియా వేదికగా నిందితుడు యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. 

హైదరాబాద్: సోదరిని లైంగికంగా వేధించిన యువకుడిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా నిందితుడు యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్‌ నగరానికి చెందిన ఓ యువకుడు వరుసకు సోదరయ్యే యువతికి అసభ్యకరమైన మేసేజ్ లు పోస్టు చేసేవాడు. గుర్తు తెలియని వ్యక్తి నుండి అసభ్యకరమైన మేసేజ్ లు రావడంతో ఆ యువతి భరించలేకపోయింది. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వేధింపులకు చెక్ పెట్టాలని భావించింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొంది.

ఈ మేసేజ్ లపై యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు టెక్నాలజీని ఉపయోగించుకొని నిందితుడిని గుర్తించారు.నిందితుడి గురించి తెలుసుకొన్న బాధితురాలు షాకైంది. వరుసకు తమ్ముడయ్యే యువకుడు లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టుగా తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.