Asianet News TeluguAsianet News Telugu

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి: ముగ్గురు క్యూనెట్ ప్రతినిధుల అరెస్ట్

సికింద్రాబాద్  స్వప్నలోక్   కాంప్లెక్స్ లో  ఆరుగురు మృతికి  కారణమైన ముగ్గురు క్యూనెట్  సంస్థ  ప్రతినిధులను  అరెస్ట్  చేశారు  పోలీసులు.  

Hyderabad  police  Arrested  Three qnet  delegates  For Swapnalok Complex  Fire Accident incient lns
Author
First Published May 30, 2023, 12:00 PM IST


హైదరాబాద్:  సికింద్రాబాద్  స్వప్నలోక్ కాంప్లెక్స్  లో ఆరుగురు మృతికి  కారణమైన  క్యూనెట్ సంస్థకు  చెందిన  ముగ్గురిని  మంగళవారంనాడు  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ  ఏడాది  మార్చి  16వ తేదీ  రాత్రి  స్వప్నలోక్ కాంప్లెక్స్ లో   జరిగిన  అగ్ని ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు.  స్వప్నలోక్ కాంప్లెక్స్  లోని  7,8  అంతస్తుల్లో  అగ్ని ప్రమాదం  జరిగింది.   ఈ ప్రమాదంలో  క్యూనెట్  సంస్థలో  పనిచేసే  ఆరుగురు  మృతి చెందారు. 

 మల్టీ లెవల్  మార్కెటింగ్  పేరుతో క్యూనెట్  సంస్థ  కార్యకలాపాలు  చేపట్టింది.   ఈ సంస్థలో  పెట్టుబడులు పెడితే  ఉద్యోగాలు  కల్పిస్తామని  నిరుద్యోగులకు  ఆశలు  కల్పించిందనే  ఆరోపణలున్నాయి. ఈ ప్రచారం   ఆధారంగా  నిరుద్యోగులు  కొందరు  క్యూనెట్  సంస్థలో  పెట్టుబడులు  పెట్టి  ఉద్యోగాలు  పొందారని  ప్రచారం సాగుతుంది. ఈ విషయమై  విచారణ  నిర్వహించి    క్యూనెట్ కు  చెందిన  ముగ్గురిని  ఇవాళ  పోలీసులు అరెస్ట్  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios