భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో న్యూఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఇవాళ అర్థరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అర్థరాత్రి వరకు వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లే వారి కోసం సేవలను పొడిగించినట్లు తెలిపింది.

మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్ నుంచి నేటి అర్థరాత్రి 12 గంటల వరకు మెట్రో నడుస్తుందని వెల్లడించింది.. అలాగే అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్ నుంచి అన్ని వైపులకు రాత్రి 12.30 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.