ఓ వ్యక్తి లారీ డ్రైవింగ్ నేర్చుకుంటూ... ఓ తండ్రి, కూతురి ప్రాణాలను తీశాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్ మాండ్యా గ్రామానికి చెందిన పేరాలాల్(34) జీవనోపాధి కోసం  హైదరాబాద్ కి తరలి వచ్చారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ... జీవనం సాగిస్తున్నాడు. పేరాలాల్ కి భార్య సోను కుమారి, కుమార్తె సరస్వతి(2) ఉన్నారు. నిర్మాణం జరుగుతున్న భవనంలోనే చిన్న గుడిసెలా ఏర్పాటు చేసుకొని.. పేరాలాల్ కుటుంబంతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో...ఓ లారీ వారి నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పేరాలాల్, అతని కుమార్తె సరస్వతి కన్నుమూశారు. భార్య సోను కుమారి గాయాలపాలై... ప్రస్తుతం ఆస్పత్రిలోచికిత్స పొందుతోంది.

అయితే... అక్కడ పనిచేలే ఓ యువకుడు లారీ డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.  కాగా.. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.