హైద్రాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం: ఐదుగురు అరెస్ట్

ఆన్ లైన్ ట్రేడింగ్  పేరుతో  మోసం  చేసిన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు  ఇవాళ అరెస్ట్  చేశారు.

Hyderabad Cyber Crime Police Arrested  Five  members Team for cheating lns

హైదరాబాద్: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో  150 మంది సభ్యుల నుండి డబ్బులు వసూలు చేసిన  ఐదుగురు సభ్యుల ముఠాను  హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు  బుధవారంనాడు అరెస్ట్  చేశారు.ఈ ముఠాకు  సంబంధించి  సైబర్ క్రైమ్ పోలీసులు  మీడియా సమావేశం ఏర్పాటు  చేశారు.  ఈ ముఠాకు  సంబంధించిన  వివరాలను  సైబర్ క్రైమ్ పోలీసులు  వివరాలు మీడియాకు వివరించారు.

ఆన్ లైన్  ట్రేడింగ్ పేరుతో  వెబ్ సైట్లు, కాల్ సెంటర్లు  ఏర్పాటు  చేసి డబ్బులు వసూలు  చేశారని  పోలీసులు  చెప్పారు.  ట్రేడింగ్ లో డబ్బులు పెడితే  తాము అధిక లాభాలను  తీసుకువస్తామని నమ్మించారు. టెలికాలర్లు, వెబ్ సైట్లను నమ్మి  150 మంది  పెట్టుబడి పెట్టారు. వీరి నుండి సుమారు  కోటి రూపాయాలను  వసూలు  చేశారని  సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

కాల్ సెంటర్లలో పనిచేసిన వారికి  నోటీసులు జారీ చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. నిందితుల నుండి  ఆరు మొబైల్స్ ను సీజ్ చేశారు. కాల్ సెంటర్ నుండి  38 ల్యాప్ టాప్ లను  స్వాధీనం  చేసుకున్నామని  పోలీసులు  చేసుకున్నారు. నిందితులు  ఉపయోగించిన  ఐదు బ్యాంకు ఖాతాలను గుర్తించినట్టుగా  పోలీసులు చెప్పారు. మరో వైపు  ఈ కేసులో 150 మంది బాధితులే  ఉన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది దర్యాప్తులో తేలనుందని  పోలీసులు  తెలిపారు. అధిక లాభాలను  ఆశ చూపి ప్రజల నుండి ఈ ముఠా డబ్బులను  వసూలు చేసిందని  సైబర్ క్రైమ్ పోలీసులు  వివరించారు. ఈ తరహా మోసాలకు  పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా  ఉండాలని ఆయన కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios