పెళ్లికి వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తూ.. మార్గ మధ్యలో యూటర్న్ తీసుకుంటుండగా... రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య భర్తతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సుల్తాన్ షాహి ప్రాంతానికి చెందిన కర్ణకోటి గణేష్ కుమార్ ఎలక్ట్రీషియన్ గా  విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి భార్య జ్యోతి.. ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. జ్యోతి స్కూల్లో అటెండర్ గా విధులు నిర్తర్తిస్తోంది. కాగా... ఆదివారం దంపతులు ఓ పెళ్లికి హాజరై తిరిగి ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మీర్ పేట సమీంలో... వారు యూటర్న్ తీసుకుంటుండగా... ఓ కారు వారిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా... గణేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు డ్రైవర్ మోహన్ సతీష్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.