Asianet News TeluguAsianet News Telugu

కొడుకు కోరిక మేరకు తల్లికి హైదరాబాద్ పోలీసుల సర్ప్రైజ్ అదుర్స్, వీడియో వైరల్

సైనిక్ పురిలో నివాసముంటున్న కుట్టి పాల్ అనే రిటైర్డ్ టీచర్ 60వ జన్మదినోత్సవం నిన్న. ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు.తనయుడు ఆల్ఫ్రెడ్ అమెరికాలో ఉంటున్నాడు.తన తల్లి పుట్టినరోజునాడు ఒక సర్ప్రైజ్ ఇవ్వమని మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత మూర్తిని సంప్రదించాడు.

Hyderabad Cops surprise woman on birthday after her son's request from US
Author
Hyderabad, First Published Apr 25, 2020, 9:35 AM IST

ఈ కరోనా వైరస్ మహమ్మారి బారి నుండి తప్పించుకునేందుకు భారతదేశం లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. 

సైనిక్ పురిలో నివాసముంటున్న కుట్టి పాల్ అనే రిటైర్డ్ టీచర్ 60వ జన్మదినోత్సవం నిన్న. ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె తనయుడు ఆల్ఫ్రెడ్ అమెరికాలో ఉంటున్నాడు. ఈసారి తల్లి పుట్టినరోజుకు ఎలాగైనా హైదరాబాద్ రావాలని అనుకున్నాడు. 

కానీ ఈ లాక్ డౌన్ వల్ల తనప్రయాణం వాయిదా పడింది. దీనితో ఏమి చేయాలో అర్థం కాక ఆల్ఫ్రెడ్ మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత మూర్తిని సంప్రదించాడు. తన తల్లి పుట్టినరోజునాడు ఒక సర్ప్రైజ్ ఇవ్వమని కోరాడు. 

డీసీపీ కూడా అంగీకరించి సీఐ నరసింహ స్వామిని ఇందుకు పురమాయించింది. నిన్న మధ్యాహ్నం అక్కడకు చేరుకున్న పోలీసులు మ్యూజిక్ సిస్టం పెట్టి బర్త్ డే పాటను పాడారు. వారు అలా బర్త్ డే విషెస్ చెబుతుండగా చుట్టుపక్కల ఉన్న వారంతా బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆ తరువాత పోలీసులు అక్కడ ఉన్నవారందరికి ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా మాస్కులు, శానిటైజర్లను పంచారు. ఈ సడన్ సర్ప్రైజ్ తో ఆ మహిళా చాలా ఆనందంగా ఫీల్ అయింది. 

ఒంటరిగా ఈ లాక్ డౌన్ కాలంలో తన బర్త్ డే జరుపుకోవాల్సి వస్తుంది అన్న బాధ లేకుండా పోలీసులు తమ పెద్ద మనసును చాటుకొని ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకాన్ని మాత్రం మిగిల్చగలిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios