హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణిలు గురువారం నాడు పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే.

హైద్రాబాద్ మధురానగర్ ప్రతిభా హైస్కూల్ లో పదో తరగతి పరీక్షలను వీణా వాణిలు పరీక్ష రాశారు. యూసుఫ్ గూడ స్టేట్ హోం నుండి అవిభక్త కవలలు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వీణా వాణిలు పరీక్షలు రాసే పరీక్ష కేంద్రానికి చేరుకొని వారికి విషెష్ చెప్పారు. అంతేకాదు వారికి పెన్నులు గిఫ్ట్ గా ఇచ్చారు.

2004 లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట ప్రైవేట్ ఆసుపత్రిలో వీణావాణిలు జన్మించారు. వీరిద్దరిని వీడదీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సాధ్యం కాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్టేట్ హోంలో వీణావాణిలు ఉంటున్నారు. చిన్నప్పటి నుండి వీణా వాణిలు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్టేట్ హొంలో వీణా వాణిలు ఉంటున్నారు.

వీరిద్దరూ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. వీణా వాణిలకు సాధారణ విద్యార్థుల కంటే అరగంట ఎక్కువ సమయాన్ని కేటాయించారు. వీణా వాణిలు పరీక్షలు రాసేందుకు  ఇద్దరు సహయకులకు అధికారులు అనుమతించారు.