Asianet News TeluguAsianet News Telugu

లోన్ యాప్ కేసు: ఐసీఐసీఐ కోల్‌కత్తాబ్యాంకు మేనేజర్ అరెస్ట్

లోన్ యాప్ కేసులో ఐసీఐసీఐ కోల్‌కత్తా బ్యాంకు మేనేజర్ రాకేష్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు కోల్‌కత్తా  ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ రాకేష్ కుమార్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad CCS police arrested kolkata ICICI bank manager Rakesh kumar
Author
Hyderabad, First Published Aug 30, 2021, 6:55 PM IST

హైదరాబాద్: లోన్ యాప్ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ రాకేష్ కుమార్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.లోన్ యాప్ కేసులో నిందితులకు సహకరించారని ఐసీఐసీఐ కోల్‌కత్తా బ్రాంచీ మేనేజర్ రాకేష్ కుమార్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  అరెస్ట్ చేశారు.లోన్ యాప్ కేసులో సీసీఎస్ పోలీసులు  నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయితే నిందితులకు సహకరిస్తూ ఈ ఖాతాలను డీఫ్రీజ్ చేశారని రాకేష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆన్‌లైన్ లోన్ యాప్ ల కేసుల్లో  దేశంలోని 1100 బ్యాంకు ఖాతాలను హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయించారు. అయితే ఈ వ్యవహరంలో కీలకంగా ఉన్నజెన్నీఫర్ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి  కోటిన్నరను ఇతర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది.

ఇదే తరహాలో గురుగ్రామ్ లోని ఐసీఐసీఐకి లేఖ రాశారు. 39 బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరారు.  అయితే ఈ విషయమై కొరియర్ లో బ్యాంకుకు లేఖ రాశారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఐసీఐసీఐ హైద్రాబాద్ అధికారులను సంప్రదించారు. ఈ కేసులో నకిలీ పోలీసు అధికారిని సీసీఎస్  పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios