Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు:ఎన్ఐఏ కి బదిలీ

హైద్రాబాద్ నగరంలో  పేలుళ్లకు  కుట్ర పన్నిన  జాహెద్  గ్యాంగ్  పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.   జాహెద్ గ్యాంగ్  కు ఇంకా ఎవరెవరు  సహకరించారనే విషయమై  ఎన్ఐఏ దర్యాప్తు  చేస్తుంది.  
 

Hyderabad  Blast  Case  Shifts  To NIA
Author
First Published Feb 5, 2023, 9:54 AM IST


హైదరాబాద్: నగరంలో  పేలుళ్లకు కుట్ర పన్నిన  జాహెద్  గ్యాంగ్  పై  ఎన్ఐఏ కేసు నమోదు  చేసింది.ఈ కేసును  ఎన్ఐఏ విచారిస్తుంది. 2022 డిసెంబర్  మాసంలో జాహెద్  గ్యాంగ్  ను  పోలీసులు అరెస్ట్  చేశారు. పాకిస్తాన్, నేపాల్ మీదుగా  జాహెద్ గ్యాంగ్  హైద్రాబాద్  కు పేలుడు పదార్ధాలను  తరలిచింది. దసరా  పర్వదిం సందర్భంగా నిర్వహించే  వేడుకల్లో  కూడా పేలుళ్లు జరపాలని  ఈ గ్యాంగ్  ప్లాన్  చేసింది. ఈ  ఘటనకు  సంబంధించి ఎన్ఐఏ తమ  దర్యాప్తులో కీలక విషయాలను  గుర్తించింది.

నగరంలోని   రద్దీ ప్రాంతాల్లో  పేలుళ్లకు  పాల్పడాలని నిందితులు ప్లాన్  చేశారు.  దేశంలో  అంతర్గత  భద్రతకు  ముప్పు  కల్గించేలా  ఈ ముఠా ప్లాన్  చేసింది.   జాహెద్ , సమీద్దున్,  మాజా హసన్ లను పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ ముఠా  దసరా వేడుకల్లో  ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను కూడా  హత్య చేయాలని  కుట్ర పన్నినట్టుగా  పోలీసులు గుర్తించారు.

also read:హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు: కీలక విషయాలను గుర్తించిన పోలీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  హైద్రాబాద్ సిటీ  పోలీస్ కమిషనర్ కార్యాలయం లో  ఆత్మాహుతి  దాడి జరిగింది. ఈ  ఘటనలో   సిటీ పోలీస్ కమిషనర్   కార్యాలయంలో  హోంగార్డు  మృతి చెందాడు. సూసైడ్ బాంబర్  మృతి చెందారు.  ఈ ఘటనలో  సూసైడ్ బాంబర్ కు   జాహెద్  ఆశ్రయం ఇచ్చాడు.ఈ కేసులో  జాహెద్  జైలులో  శిక్ష అనుభవించాడు. జైలు  నుండి బయటకు వచ్చిన తర్వాత  కూడా   జాహెద్  ఉగ్రవాద కార్యకలాపాలకు  పాల్పడుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios