వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిలపై  హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. 


హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గురువారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి, ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు విషయమై వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా కేసీఆర్ వ్యవహరించాలని ఆమె కోరారు. అఫిడవిట్ పత్రాలపై సంతకం చేయాలని కోరారు. ఈ మేరకు అఫిడవిట్ పై సంతకం చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల విమర్శలు చేస్తున్నారు.