హైదరాబాద్:

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో సుమారు 54 శాతం మందికి కరోనా యాంటీబాడీస్ ఉన్నట్టుగా సీసీఎంబీ తెలిపింది.కరోనా విషయంలో సీసీఎంబీ, ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా సర్వే నిర్వహించింది. 

నగరంలోని సుమారు 9 వేల శాంపిల్స్ ను సేకరించారు. హైద్రాబాద్ పట్టణంలోని 30 వార్డుల్లో 300 మంది నుండి  శాంపిల్స్ సేకరించారు.  పదేళ్ల నుండి వృద్దుల వరకు శాంపిల్స్ తీసుకొన్నారు.

ప్రతి 54 మందిలో కరోనా యాంటీ బాడీస్ ఉన్నట్టుగా గుర్తించింది సీసీఎంబీ. మహిళల కంటే పురుషుల్లో 3 శాతం అధికంగా యాంటీ బాడీస్ ఉన్నట్టుగా ఈ నివేదికలు తెలుపుతున్నాయి.వయస్సు పై బడిన వారిలో యాంటీబాడీస్ తక్కువగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

గతంలో కూడ కరోనా విషయంలో సీసీఎంబీ అధ్యయనం చేసింది.తాజాగా చేసిన అధ్యయనంపై 54 శాతం మందికి యాంటీబాడీస్  ఉన్నట్టుగా  తేలింది.నగరంలోని 75 శాతం ప్రజలకు తాము కరోనాకు గురైనట్టుగా తెలియదని ఈ నివేదిక తెలుపుతోంది. గతంలో కరోనాకు గురైన వారు మరోసారి కూడ ఈ వైరస్ బారినపడినట్టుగా ఈ అధ్యయనంలో తేలింది.

నగర ప్రజల్లో ఎక్కువగా కరోనా యాంటీబాడీస్ వృద్ది చెందుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు.