హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో ఉపాధి భరోసా పాదయాత్రకు సిద్దమైన ఇందిరా శోభన్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇళ్లందకుంటలో మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ చేపట్టిన ఉపాధి భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారింది. పాదయాత్రకు సిద్దమైన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోబోగా ఇందిరా శోభన్ వారిని ప్రతిఘటించారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఉపాధి భరోసా పాదయాత్రకు అనుమతి కోసం రెండురోజుల క్రితమే దరఖాస్తు చేసినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. మొదట పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సిపి సత్యనారాయణ ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్ళతో మాట మార్చారని ఆరోపించారు. శాంతియుతంగా పాదయాత్రకు సిద్దమైతే పోలీసులు ఇలా అడ్డుకోవడం దారుణమని ఇందిరా శోభన్ అన్నారు.
read more మల్లారెడ్డి.. దమ్ముంటే అవినీతిపై విచారణకు సిద్ధమవ్వు: దాసోజు శ్రవణ్
పాదయాత్రకు ముందు ఆలయంలో పూజకు వెళ్లిన శోభన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలోకి దౌర్జన్యంగా వచ్చి ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు హుజురాబాద్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
ఇక పాదయాత్ర చేయకుండా ఇందిరా శోభన్ ను అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువత, ఫీల్డ్ అసిస్టెట్లు ఆందోళనకు దిగారు. వీరంతా ఇల్లంతకుంట చౌరస్తాలో ధర్నాకు దిగారు. వెంటనే ఇందికా శోభన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
