భర్త పాదాలకు భార్య నమస్కారం చేయడం.. అవసరమైతే పాదపూజ చేయడం మనం అనతి కాలంగా చూస్తూనే ఉన్నాం. భర్తకు పూజ చేయడమే భార్య ధర్మం అన్నట్లుగా మాట్లాడేవారు కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. సమాజ సేవ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన తన భార్య పాదాలకు పూజ చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రోనా కట్టడికి పోలీసులు అహర్నిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. వారి సేవలకు యావద్దేశం సెల్యూట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఎస్‌ఐ చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ ఆమె భర్త కాళ్లు కడిగి శాలువాతో సన్మానించాడు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురం పోలీస్ స్టేషన్‌లో సంధ్య ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 

కరోనాపై పోరులో భాగంగా సరైన తిండీతిప్పలు లేకుండా, కుటుంబాన్ని వదిలి విఽధులు నిర్వహిస్తున్నారు. తన భార్య చేస్తున్న బాధ్యతాయుతమైన పనికి ముగ్ధుడైన భర్త సుభాన్‌ ఇంట్లో ఆమె కాళ్లు కడిగాడు. శాలువాతో సత్కరించాడు. కరోనా నియంత్రణకు అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసులకు ఏం చేసినా తక్కువే అని ఆయన కొనియాడారు.