ములుగులో ప్రియుడితో రాసలీలలు: రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త, చేతులు కట్టేసి ఇలా..
భర్త లేడని ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న భార్యను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు భర్త . వీరిద్దరిని చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించాడు భర్త. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
ములుగు: ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యండె్ పట్టుకున్నాడు భర్త. ఈ ఘటన ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో జరిగింది. మంగపేట ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది వివాహిత. అదే స్కూల్లో పనిచేసే కె. నాగేంద్రబాబు అనే టీచర్ తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన భర్త భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను , ఆమె ప్రియుడిని భర్త రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. ఈ ఇద్దరిని ఇంట్లో కట్టేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరిని చేతులు కట్టేసి గ్రామంలో నడిపించుకంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు. వివాహిత భర్త ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.