హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ షాకింగ్ విషయం బయటపడింది. బహుళ అంతస్థుల భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ భవనంపై దిగ్భ్రాంతికి గురిచేసే విషయం వెలుగు చూసింది. బహుళ అంతస్థుల కమర్షియల్ భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు కనిపించాయి. ఈ సంఘటన హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ లో చోటు చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కూలీలు చెత్తకుప్పలను ఎత్తిపోస్తుండగా ఎఎస్ రావు నగర్ లోని వోర్టెక్స్ భవనం టెర్రాస్ మీద మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. భవనం నాలుగో అంతస్థులో ఓ జూనియర్ కాలేజీ ఉంది. విద్యార్థులు టెర్రాస్ మీదికి వెళ్లకుండా దానికి తాళం వేశారు. అది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. 

చెత్తను ఎత్తిపోయడానికి, వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరించడానికి కూలీలను మంగళవారం టెర్రాస్ మీదికి పంపించారు. ఆ సమయంలో పుర్రె, ఎముకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు కుషాయిగుడా ఇన్ స్పెక్టర్ ఎ మన్మోహన్ తెలిపారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు