ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహణకు అనుమతివ్వాలని హిందూ వాహిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్: ఉమ్మడి Adilabad జిల్లాలోని Bhainsa లో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ హిందూ వాహిని సంస్థ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది భైంసాలో Sri Rama Navami శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హిందూ వాహిని సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
భైంసాలో గతంలో పలు సమయాల్లో ఇరు వర్గాల మధ్య ఘరషణలు జరిగాయి.దీంతో భైంసాను పోలీసుల అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తించారు. అయితే భైంసాలో శ్రీరామ నవమి సందర్భంగా Shobha Yatraకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేయనుంది.
