హైదరాబాద్: తెలంగాణ తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ గురువారం నాడు ప్రమాణం చేశారు. హిమా కోహ్లీతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం నాడు రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు.

తెలంగాణ తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లి ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో  పలువురు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

1959 సెప్టెంబర్ 2న జస్టిస్ హిమా కోహ్లి జన్మించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లి  ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గత  ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తర్వాత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో డిసెంబర్ 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లిని నియమించారు.