హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఓ రాజకీయ పార్టీ శివాజీ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అల్లర్లు జరగకుండా ఉండేందుకు గాను భారీగా మోహరించారు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండటంతో.. పెట్టి తీరుతామంటూ కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.