హైదరాబాద్: మల్లన్న సాగర్ భూముల వ్యవహరంలో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు  రూ.2 వేల జరిమానాను విధిస్తూ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.

మల్లన్నసాగర్ భూముల విషయంలో అధికారులు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టు తేల్చింది. దీంతో దీనికి బాధ్యులైన అధికారులకు జైలు శిక్ష విధించింది. మల్లన్నసాగర్ భూముల  వ్యవహరంలో  తప్పుడు సమాచారం ఇచ్చారని తొగుట ఎమ్మార్వో వీర్‌సింగ్, సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సూపరింటెండ్ వేణుకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు.  ఈ జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించింది.