హైదరాబాద్:ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం నాడు ఐటీ గ్రిడ్ ఎండీ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వారంలో ఒక్క రోజు పాటు  పోలీసుల విచారణకు హాజరుకావాలని  హైకోర్టు ఆశోక్‌ను ఆదేశించింది. ఐటీ గ్రిడ్‌ కేసులో  పలు దఫాలు నోటీసులు జారీ అయ్యాయి.ఈ నోటీసులకు ఆశోక్‌ నుండి స్పందన రాలేదు. ఆశోక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.  మరో వైపు పాస్‌పోర్టును పోలీసులకు కూడ  అప్పగించాలని ఆశోక్‌ను ఆదేశించారు.