Asianet News TeluguAsianet News Telugu

సెక్రటేరియట్ కూల్చివేత: హైకోర్టులో కేసీఆర్‌కు ఊరట

సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
 

high court did not give stay on demolation on secreatariat building
Author
Hyderabad, First Published Jul 3, 2019, 6:29 PM IST

సచివాలయ భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు  దాకలు చేసిన పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది.

ప్రభుత్వ పాలసీ విధానాలపై తాము జోక్యం చేసుకోబోమని  హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు గత నెల 27వ తేదీన కేసీఆర్  భూమిపూజ కూడ చేశారు.

అయితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటే  అప్పుడు తాము జోక్యం చేసుకొంటామని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకొంటామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios