Asianet News TeluguAsianet News Telugu

తప్పిన ప్రమాదం: యాదాద్రిలో విరిగిన కొండచరియలు, ఘాట్‌రోడ్డులో రాకపోకల నిలిపివేత (వీడియో)

 యాదాద్రిలో గురువారం నాడు కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన కారణంగా  రెండో ఘాట్ రోడ్డు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

heavy rains casuse landslides at yadadri temple lns
Author
Yadagirigutta Temple, First Published Jul 22, 2021, 10:13 AM IST

యాదాద్రి భువనగిరి: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో గురువారం నాడు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కొండ చరియలు విరిగిన సమయంలో వాహనాల రాకపోకలు లేవు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు.  ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలను  తలగించ ేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్డును క్లియర్ చేసిన తర్వాత ఈ రోడ్డుపై రాకపోకలను అనుమతిని ఇచ్చే అవకాశం ఉంది.

వీడియో

రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు  కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.  ఈ హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి  ఆలయాన్ని  పునరుద్దరించే పనులు చేపట్టారు.ఈ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది.  ఈ పనులను మరింత వేగవంతం చేయాలని  సీఎం కేసీఆర్ ఆదేశించారు.  ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios