కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న హెల్త్ వర్కర్ వనిత మృతి: నిర్ధారించని వైద్యాధికారులు

వరంగల్ అర్బన్ జిల్లాలో హెల్త్ వర్కర్ వనిత మరణించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆమె మరణించినట్టుగా  మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. వనిత మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణమా కాదా అనే విషయమై ఇంకా నిర్ధారణ కాలేదు.

Health worker vanitha dies after taking corona vaccine lns

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో హెల్త్ వర్కర్ వనిత మరణించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆమె మరణించినట్టుగా  మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. వనిత మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణమా కాదా అనే విషయమై ఇంకా నిర్ధారణ కాలేదు.

గతంలో కూడ నిర్మల్ జిల్లాలో విఠల్ రావు అనే 108 అంబులెన్స్ డ్రైవర్ మరణించాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఛాతీ నొప్పి కారణంగానే ఆయన మరణించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు.

మరో వైపు వరంగల్ అర్బన్ జిల్లాలోని శాయంపేట అంగన్ వాడీ కేంద్రంలో  పనిచేస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆమె వ్యాక్సిన్ తీసుకొంది. ఈ వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత  ఆమె అనారోగ్యానికి గురైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారని కుటుంబసభ్యులు చెప్పారు.

తాజాగా ఏపీ రాష్ట్రంలోని గుంటూరులో కూడ ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత  ఆమె మరణించినట్టుగా కుటుంబసభ్యులు, ఆశా వర్కర్స్ యూనియన్ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలను వైద్యులు ఖండిస్తున్నారు.విజయలక్ష్మి బ్రెయిన్ డెడ్ కారణంగానే మరణించిందని జీజీహెచ్ సూపరింటెండ్ ప్రకటించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios