Asianet News TeluguAsianet News Telugu

హరితహారం చెట్ల ధ్వంసం: జరిమానా కట్టిన యజమాని

సిద్ధిపేటలో కరీంనగర్ రోడ్డులో అల్లవుద్దీన్ స్టీల్ ట్రేడర్స్ దుకాణం యజమాని హరితహారం మొక్కలను ధ్వంసం చేశారు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యజమాని తన తప్పును అంగీకరించి జరిమానా కట్టి, ఇకపై ఇటువంటి తప్పు చేయనని హామీ ఇచ్చారు.

Haritha haram plants destroyed bu allauddin steel traders
Author
Siddipet, First Published Jul 20, 2019, 2:43 PM IST

సిద్ధిపేట: కరీంనగర్ రోడ్డులో గల అల్లావుద్దీన్ స్టీల్ ట్రేడర్స్ వారు హరితహారం చెట్లను ధ్వంసం చేసి కాలపెట్టారు. మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ఆదేశానుసారం కరీంనగర్ రోడ్డులో హరితహారం మొక్కలు పెట్టినప్పుడు కూడా అడ్డుకున్నారు. 

తమ వాహనాలకు అడ్డుగా ఉంటుందని, తాను కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తినేనని చెప్పి మొక్కలు తన షాప్ ముందు పెట్టొద్దని చెప్పాడు దుకాణం యజమాని చెప్పాడు. శనివారంనాడు లారీతో వాటిని ధ్వంసం చేశారు. కుండీలను, హరితహారం చెట్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావును తాము కోరినట్లు ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, హరితహారం స్పెషల్ ఆఫీసర్ సామల్ల అయిలయ్య చెప్పారు. 

ఆ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని హరీష్ రావు చెప్పినట్లు, దాంతో తాము 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుకాణం యజమాని తాను చేసిన తప్పును ఒప్పుకొని, మళ్ళీ ఇలాంటి పనులు పునరావృతం  చేయబోనని హామీ ఇచ్చి, రూ 3000 జరిమానా కట్టినట్లు ఆయన తెలిపారు. 

రానున్న రోజుల్లో మళ్ళీ హరితహారం చెట్లను నరికివేసినా, ధ్వంసం చేసినా కుండీలను నాశనం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అయిలయ్య చెప్పారు. 

Haritha haram plants destroyed bu allauddin steel traders

Haritha haram plants destroyed bu allauddin steel traders

 

Follow Us:
Download App:
  • android
  • ios