Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన: హరీష్ రావుకు కేసీఆర్ షాక్

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును దూరం పెడుతున్నారా..?పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతుందా..?గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును సమీక్షలకు, ప్రాజెక్టుల పరిశీలనలకు దూరం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..?హరీష్ రావును మంత్రి వర్గం నుంచి తప్పించలేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా..?
 

Harish Rao not invited by KCR for Kaleswaram tour
Author
Hyderabad, First Published Jan 1, 2019, 4:21 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును దూరం పెడుతున్నారా..?పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతుందా..?గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును సమీక్షలకు, ప్రాజెక్టుల పరిశీలనలకు దూరం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..?హరీష్ రావును మంత్రి వర్గం నుంచి తప్పించలేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా..?

కేసీఆర్ హరీష్ రావును అవమానిస్తున్నారంటూ ఆయన అభిమానులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..?కేసీఆర్ కు హరీష్ రావుకు ఎక్కడ చెడింది..?ముఖ్యంగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ మాజీమంత్రి హరీష్ రావు వ్యవహారంలో అనుసరిస్తున్న తీరు వెనుక పరమార్థం ఏంటి... 

రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ మాజీమంత్రి మేనల్లుడు హరీష్ రావును దూరం పెడుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ మిషన్ భగీరథ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి అధికారులు, ఎంపీ వినోద్ కుమార్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు.  గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

అంతకు ముందు నీటి పారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా హరీష్ రావు పాల్గొనలేదు. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనను పిలవకపోవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు హరీష్ రావు హయాంలో ఓఎస్డీగా పనిచేసిన  శ్రీధరరావు దేశ్ పాండే తన మాతృసంస్థకు వెళ్లిపోవడం వెనుక ఏమైనా ప్లాన్ ఉందా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

తాజాగా మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లారు. సీఎం కేసీఆర్ తోపాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా వెళ్లారు. కానీ గత మంత్రి వర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హారీష్ రావు మాత్రం హాజరు కాలేదు. హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆహ్వానించలేదు అని తెలుస్తోంది.

ఈ వరుసఘటనలు హరీష్ రావుకు పరాభవంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ కావాలనే హరీష్ రావును దూరం పెడుతున్నారంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. 

టీఆర్ఎస్ పార్టీలో సీఎం తనయుడు మాజీమంత్రి కేటీఆర్ ఒక్కో అడుగు పైకిఎక్కుతున్నారు. ఇప్పడు ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ పార్టీలో ఎదుగుతుంటే హరీష్ రావు మాత్రం ఒక్కో అడుగు వెనక్కి నడుస్తున్నట్లు అనిపిస్తోంది.

మెదటి సారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేశారు. హరీష్ సారధ్యంలో అన్ని ప్రాజెక్టులు వ‌డివ‌డిగా ముందుకు కదిలాయి. కోటి ఎకరాల సాగు నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా హరీష్ పనులను పరుగులు పెట్టించారు.   

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు కృషిని ప్రతీ ఒక్కరూ అభినందించాల్సిందే. అంతెందుకు సీఎం కేసీఆర్ స్వయంగా హరీష్ రావు కృషిని కొనియాడిన సందర్భాలు అనేకం.  

అలాంటి హ‌రీష్ రావు లేకుండా కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైనా, మిషన్ భగీరథలపైనా సమీక్షలు నిర్వహించారు. హరీష్ రావు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు కేసీఆర్. ప్రాజెక్టు పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చెయ్యాలంటూ వార్నింగ్ ఇచ్చారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు హరీష్ రావును పిలవకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టుల‌పై పూర్తి అవ‌గాహ‌న కలిగిన హ‌రీష్‌రావును పిలిస్తే పరిస్థితి వేరుగా ఉండేదని అంతా భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే హరీస్ రావుకు భారీ నీటి పారుదల శాఖ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios