కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. హరీశ్ రావు ట్విట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ధన్యవాదాలు బావ.. ఆయన అంటూ రిప్లే ఇచ్చారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ( కల్వకుంట్ల తారకరామారావు) నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. 

మంత్రి కేటీఆర్ ఈ రోజుతో 45వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. హరీశ్ రావు ట్విట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ధన్యవాదాలు బావ.. ఆయన అంటూ రిప్లే ఇచ్చారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

కాగా.. ఎంపీ సంతోష్ కుమార్ కూడా.. కేటీఆర్ కి స్పెషల్ గా విషెస్ తెలియజేశారు. కేటీఆర్ చిన్నప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో రెండింటినీ కలిపి.. సోదరుడు అని పేర్కొంటూ విషెస్ చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ.. తన అన్న ముఖం పై చిరు నువ్వు మారలేదంటూ పేర్కొనడం గమనార్హం. ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్.. టీఆర్ఎస్ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది.