Asianet News TeluguAsianet News Telugu

రైతులకు శుభవార్త.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం  ఆమోదం తెలిపింది. 

Govt of India in support of farmers has approved 6.80 LMT of parboiled rice from Telangana announces Kishan Reddy KRJ
Author
First Published May 27, 2023, 7:16 AM IST

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో తెలంగాణ రైతులకు మరోసారి కేంద్రం మద్దతుగా నిలిచింది . ఇటీవలే 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు మద్దతు ధరను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యుద్ధప్రాతిపదికన రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన గడువు లోపు ఎఫ్సీఐకి బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

పారాబాయిల్డ్ రైస్ సేకరణ కోసం గత నెలలో  కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు గత నెలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలగాణ నుంచి దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయాలని , అకాల వర్షాలతో నష్టపోయిన తెలంగాణ రైతులను అదుకోవాలని , తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ సానుకూలంగా స్పందించారు. కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు . రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అనేకసార్లు లేఖలు, రిమైండర్‌లు రాసినా సకాలంలో బియ్యం అందించలేకపోయిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios