టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం.. కార్మికులకు శుభాకంక్షలు..
టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఇక, గత అసెంబ్లీ సమావేశాల్లో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తాజాగా గవర్నర్ తమిళిసైతో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆమోదం తెలిపిన దాదాపు నెల రోజుల తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.