గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన హిజ్రా చంద్రముఖి అదృశ్యం కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆమె ఆచూకీని కనుగొన్న పోలీసులు హైకోర్టు ఎదుట చంద్రముఖిని హాజరుపరిచారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌లోని తమ నివాసానికి ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని ఆమె వెల్లడించారు. చెవికి ఇయర్ ఫోన్ పెట్టి బటన్ నొక్కితే పేలుతుందని భయపెట్టి విజయవాడ, నెల్లూరు వరకు తీసుకెళ్లారన్నారు.

వారి బారి నుంచి తప్పించుకుని చెన్నై నుంచి తిరుపతి మీదుగా తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నానని చంద్రముఖి తెలిపారు. ఎన్నికల్లో తాను ప్రచారంలో పాల్గనకుండా చేయడానికే వారు తనను కిడ్నాప్ చేశారని ఆమె స్పష్టం చేశారు.

అయితే ఇలాంటి వాటికి తాను భయపడనని.. తనను పోటీ నుంచి ఎవరూ తప్పించలేరని.. తన సామాజిక వర్గంపై ఏళ్లుగా సాగుతున్న వివక్ష పోవాలన్నారు. సుప్రీంకోర్టు సైతం ట్రాన్స్‌జెండర్‌లను ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని సూచించడంతో తాను బరిలో నిలిచానన్నారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు పోలీసులు రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించిందని చంద్రముఖి తెలిపారు. 

మీడియాతో గోషా మహల్ అభ్యర్థి చంద్రముఖి (ఫొటోలు)