Asianet News TeluguAsianet News Telugu

అనుచరుడి అంత్యక్రియలకు హాజరు: ఎమ్మెల్యే కృష్ణ మోహన్ కు కరోనా పరీక్షలు

తెలంగాణలోని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. గద్వాల జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. గద్వాల జిల్లాకు ప్రత్యేకాధికారిని కూడా నియమించారు.

Gadwal MLA Krishna Mohan tested for Coronavirus
Author
Gadwal, First Published Apr 22, 2020, 10:25 AM IST

హైదరాబాద్: తెలంగాణలోని గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆయనకు కోవిడ్ -19 నెగెటివ్ వచ్చింది. ఎమ్మెల్యేతో కాంటాక్టులోకి వచ్చినవారికి పరకీ్షలు నిర్వహించే విషయంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కొంత మంది మీడియా ప్రతినిధులను కూడా ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గురు స్టాఫ్ రిపోర్టర్లతో పాటు ఓ కెమెరామన్ ఉన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరుడు ఇటీవల మరణించాడు. ఆయన అంత్యక్రియల్లో ఆయన ఎమ్మెల్యే పాల్గొన్నారు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ శనివారంనాడు హోం క్వారంటైన్ కు వెళ్లారు. 

కృష్ణమోహన్ తో పాటు మీడియా ప్రతినిధులు చాలా సేపు గడపడమే కాకుండా ఆయనతో కలిసి భోజనం చేసినట్లు తెలుస్తోంది. గద్వాలలో పనిచేస్తున్న ఓ న్యూస్ చానెల్ రిపోర్టర్ తమ్ముడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వాళ్ల ఇంటికి చానెల్ సిబ్బంది వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా జర్నలిస్టులను ఐసోలేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, సూర్యాపేటలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఒక్క రోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా సూర్యాపేట పట్టణంలోనే నమోదయ్యాయి. 

జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేటలోనే నమోదయ్యాయి. మంగళవారం జీహెచ్ఎంసీలో కన్నా ఎక్కువ కేసులు అక్కడ నమోదయ్యాయి. దాంతో కేసీఆర్ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూర్యాపేటలో పర్యటించనున్నారు. 

అదే సమయంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న గద్వాల, వికారాబాద్ జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ జిల్లాల్లో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. 

సూర్యాపేటకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. మర్కజ్ నుంచి వచ్చినవారి గురించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios