Asianet News TeluguAsianet News Telugu

కరోనా టెన్షన్: సూర్యాపేట, గద్వాల డీఎస్పీలపై బదిలీ వేటు

సూర్యాపేట, గద్వాలల్లో కరోనా వైరస్ పాజిటిల్ కేసులు ఆంధోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట, గద్వాల డీఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి బదిలీ చేశారు. కొత్త డీఎస్పీలను అక్కడ నియమించారు.

Gadwal and Suryapet DSPs transfered
Author
Hyderabad, First Published Apr 22, 2020, 7:46 AM IST

హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభణ ఇద్దరు డిఎస్పీలకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. తెలంగాణలోని గద్వాల, సూర్యాపేట డీఎస్పీలపై డీజీపీ మహేందర్ రెడ్డి బదిలీ చేశారు. పోలీసు కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.

తెలంగాణలోని సూర్యాపేట, గద్వాలల్లో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. తీవ్రమైన ఆందోళనకు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల డిఎస్పీలు బదిలీ అయ్యారు.

సూర్యాపేట డీఎస్పీ ఎం నాగేశ్వర రావును, గద్వాల డిఎస్పీ పి. శ్రీనివాస రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు. 

హైదరాబాదులోని స్పెషల్ బ్రాంచ్ ఎసీపీ ఎస్ మోహన్ కుమార్ ను సూర్యాపేట డీఎస్పీగా, టీఎస్ పీఎ డీఎస్పీ ఎ. యాదగిరిని గద్వాల డీఎస్పీగా బదిలీ చేశారు.

సూర్యాపేట జిల్లాలో మంగళవారంనాడు కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 80కి చేరుకుంది. సూర్యాపేట పట్టణంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గద్వాలలో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios