Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో జులై 1 నుంచి స్కూల్స్ ప్రారంభం: ఇది ఫేక్ న్యూస్

తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసిందనేది ఫేక్ న్యూస్ అని తేలింది.. 

from 1st july onwards schools open in telangana
Author
Hyderabad, First Published Jun 1, 2020, 12:25 PM IST

తెలంగాణలో త్వరలోనే పాఠశాలలు కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తోందని, ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఓ ప్రకటన చేసిందని, తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్త నిజం కాదని తేలింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తను తెలంగాణ  విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఖండించారు. 

జులై 1 నుంచి ఉన్నత, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుస్తారని వచ్చిన వార్తను ఆమె ఖండించారు. ఆ వార్త వాస్తవం కాదని, పాఠశాల విద్యాశాఖ ఇంత వరకు ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదని చెప్పారు. 

అదే విధంగా పదో తరగతి పరీక్షల విషయంలో అబ్జెక్టివ్ విధానంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలనే విషయంలో పాఠశాల విద్యాశాఖ ఇంత వరకు ఏ విధమైన ఆలోచన చేయలేదని, 10వల తరగతి పరీక్షలు జూన్ 8వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చిత్రా రామచంద్రన్ చెప్పారు.  

పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసిందని వచ్చిన వార్తలో నిజం లేదని తేలిపోయింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభిస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేస్తారని అంటూ వచ్చిన వార్త కూడా నిజం కాదు. 

 

విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరని కూడా వార్తాకథనం ప్రచురితమైంది. అది కూడా నిజం కాదని స్పష్టమైంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరని, భౌతిక దూరం తప్పనిసరి. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించిందని వచ్చిన వార్తలో కూడా వాస్తవం లేదు. 

అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమేని, కాగా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారని వచ్చిన వార్తలో ఏ విధమైన వాస్తవం లేదు. 

ఈ కింది విధంగా వచ్చిన వార్తలో వాస్తవం లేదని చిత్రారామచంద్రన్ ప్రకటనను బట్టి స్పష్టమవుతోంది. ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు. అలాగే, మొత్తం పనిదినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఒక్క ఆదివారం మాత్రమే సెలవు.

 

ఈ స్థితిలో ఇంతకు ముందు రాసిన వార్తా కథనంలో అవాస్తవమైన సమాచారం ఉందని తెలియజేస్తూ వాస్తవ సమాచారంతో వార్తాకథనాన్ని అప్ డేట్ చేయడం జరిగింది. మేం చేసిన తప్పిదాన్ని సరిదిద్దుతూ వాస్తవ సమాచారంతో వార్తాకథనాన్ని అప్ డేట్ చేయడమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios