Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగాలు..షేర్ల పేరిట లక్షలకు టోకరా.. ఘరానా మోసగాడి అరెస్ట్..

ఉద్యోగాల పేరుతో, జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఈ వ్యక్తి నల్గొండ, ఖమ్మం, విజయవాడల్లో మోసాలకు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెడితే...

fraudster from vijayawada arrested in nalgonda - bsb
Author
Hyderabad, First Published Mar 1, 2021, 9:17 AM IST

ఉద్యోగాల పేరుతో, జ్యోతిష్యం పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఈ వ్యక్తి నల్గొండ, ఖమ్మం, విజయవాడల్లో మోసాలకు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెడితే...

విజయవాడ పట్టణ పరిధిలోని భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డి నల్గొండ, హనుమాన్ నగర్ లో సామినేని సాయి ఇంటికి వెళ్లి జ్యోతిషం చెప్పాడు. ఇంటలో బాగాలేదని, శాంతి పూజలు చేస్తేనే ఇల్లు నిలబడుతుందని నమ్మించాడు. 

అతడి మాటలు నమ్మిన సాయి రూ. 4.35 లక్సలు ముట్టజెప్పగా అచ్చిరెడ్డి ఆ డబ్బుతో పరారయ్యాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో నల్గొండ టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అచ్చిరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడు ఇంతకుముందు కూడా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్ వేర్ కంపెనీలో షేర్లు ఇస్తానని నమ్మించి ఆమె వద్ద రూ. 50 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. 

ఖమ్మం పట్టణానికే చెందిన మరో మహిళను రైల్వేలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ. 25 లక్షలు,  విజయవాడకు చెందిన ఓ మహిళను టీవీలో యాంకర్‌ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఆమె నుంచి రూ.25 లక్షలు వసూలు చేశాడు. 

బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై నల్గొండ, ఖమ్మం, విజయవాడల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో సుమారు 12 కేసులు నమోదయ్యాయి. నిందితుడి కుమారుడు ఏపీలోని వైఎస్ఆర్‌సీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios