హైదరాబాద్ శివారులో విషాద సంఘటన చోటుచేసుకుంది. శివారు ప్రాంతంలోని ఓ కోళ్లఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. 

మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్(20), అరవింద్‌‌గౌడ్(23), మహేశ్ ముదిరాజ్(20), మహేందర్ రెడ్డి(25) లు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వలస వచ్చారు. శామీర్ పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలోని ఓ కోళ్ళపారంలో పనికి కుదిరారు. అయితే వీరందరు ఇవాళ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీళ్లవి సహజ మరణమా లేక ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా అన్న కోషంలో పోలీసులు విచారణ చేపట్టారు.