ఓ వైపు ట్రాన్స్ జెండర్స్ తమకూ అందర్లాగే సమాన హక్కులు, గౌరవం కావాలని ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు కొంతమంది వాటిని నీరుగార్చేలా చేస్తున్నారు. తమ చర్యలతో జనాల్ని భయాందోళనలకు గురి చేసి అసహ్యం పుట్టిస్తున్నారు. 

ఇలాంటి సంఘటనే హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో సోమవారం జరిగింది. నలుగురు ట్రాన్స్ జెండర్స్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, జేబులో డబ్బులు లాక్కొన్ని గొడవ సృష్టించారు. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

వివరాల్లోకి వెడితే.. దూలపల్లి గ్రామానికి చెంది మల్లేశం కొత్తగా కట్టుకున్న ఇంట్లో సోమవారం గృహప్రవేశం చేసుకున్నాడు. టెంట్ కనబడితే చాలు వాలిపోయే ట్రాన్స్ జెండర్స్ ఇక్కడికీ వచ్చేశారు. స్వాతి, శ్రావని, శివాణి, భూమి అనే నలుగురు ట్రాన్స్ జెండర్స్ వచ్చి తమకు ఈనాం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. 

గృహప్రవేశం సందర్భంగా తాము అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని, ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గలాటా సృష్టించారు. దీంతో డబ్బులు ఇవ్వడానికి మల్లేశం ఒప్పుకోలేదు. ఎంతకీ మల్లేశం ఒప్పుకోవడం లేదన్న కసితో ఇంటిపైకి రాళ్లు, మట్టి విసిరారు. 

అసభ్యంగా ప్రవర్తిస్తూ మల్లేశం జేబులోని రూ. 4వేలు లాక్కున్నారు. బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాన్స్‌జెండర్స్‌పై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.