రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రహదారిపై డీసీఎంను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ రహదారిపై డీసీఎంను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది.
