Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో చేరిన విజయశాంతి: 20 ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేసిన మాజీ కేంద్ర మంత్రి

 సినీ నటి, మాజీ  ఎంపీ విజయశాంతి సోమవారం నాడు బీజేపీలో చేరారు. గతంలో విజయశాంతి బీజేపీలోనే ఉంది.  బీజేపీ నుండి ఆమె తల్లి తెలంగాణ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ నుండి ఆమె తిరిగి ఇవాళ బీజేపీలో చేరారు.

Former Union Minister Vidyasagar Rao shared a photo of Vijayashanti 20 years ago
Author
Hyderabad, First Published Dec 7, 2020, 3:10 PM IST

హైదరాబాద్:  సీనీ నటి, మాజీ  ఎంపీ విజయశాంతి సోమవారం నాడు బీజేపీలో చేరారు. గతంలో విజయశాంతి బీజేపీలోనే ఉంది.  బీజేపీ నుండి ఆమె తల్లి తెలంగాణ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ నుండి ఆమె తిరిగి ఇవాళ బీజేపీలో చేరారు.

విజయశాంతి బీజేపీలో చేరిన సందర్భంగా 20 ఏళ్ల  క్రితం నాటి ఫోటోను మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు పోటోను షేర్ చేశారు. 1998లో విజయశాంతి బీజేపీలో చేరుతున్న సందర్భంగా బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో సమావేశమైన ఫోటోను విద్యాసాగర్ రావు షేర్ చేశారు. 

20 ఏళ్ల క్రితం అద్వానీ నివాసంలో తనతో పాటు విజయశాంతి అద్వానీతో సమావేశమైన ఫోటోను విద్యాసాగర్ రావు మీడియాకు షేర్ చేశారు. 20 ఏళ్ల తర్వాత విజయశాంతి తిరిగి బీజేపీలోకి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. 

ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి సమావేశమయ్యారు. ఇవాళ బీజేపీ కార్యదర్శి అరుణ్ సింగ్  సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. పలువురు  కాంగ్రెస్ నేతలు కూడ బీజేపీలో  చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడంతో బీజేపీ నేతల్లో  జోష్ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios