సిర్పూర్ కాగజ్‌నగర్:  సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం నాడు ఉదయం మృతి చెందాడు. ఆయన వయస్సు 68 ఏళ్లు.
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మృతి చెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించాడు. 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోనేరు కోనప్పపై ఆయన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన తొలిసారిగా అసెంబ్లీలో ప్రవేశించారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడంతో 2010లో ఉప ఎన్నికలు వచ్చాయి. సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆ సమయంలో కావేటి సమ్మయ్య పోటీ చేశారు.

సమ్మయ్యపై ఆ సమయంలో ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఉప ఎన్నికల్లో కావేటి సమ్మయ్య విజయం సాధించాడు. ఆ సమయంలో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు కోసం ఆనాడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ సమ్మయ్య విజయం సాధించాడు.

2014లో జరిగిన ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కావేటి సమ్మయ్య పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యాడు. బీఎస్పీ టిక్కెట్టుపై పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించారు. నిర్మల్ నుండి బీఎస్పీ టిక్కెట్టుపై పోటీచేసిన ఇంద్రకరణ్ రెడ్డి కూడ విజయం సాధించాడు.

Also read:30 రోజులకే కరెంట్ రీడింగ్,మొబైల్‌కు బిల్లులు: టీఎస్‌ఎస్ పీడీసీఎల్

ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు తమ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.  దీంతో అప్పటి నుండి వీరిద్దరూ కూడ టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. 2014 నుండి ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కావేటి సమ్మయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. సమ్మయ్య కు బదులుగా  కోనేరు కోనప్పకు టిక్కెట్టు ఇచ్చారు.  2018 ఎన్నికల్లో కోనప్ప విజయం సాధించారు.

ఉమ్మడి ఏపీరాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కావేటి సమ్మయ్య కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కావేటి సమ్మయ్య ఓటమి పాలయ్యాడు.