Asianet News TeluguAsianet News Telugu

అనర్హత వేటు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వనమా దూరం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉండనున్నారు.  గత నెలలో  వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు  అనర్హత వేటేసింది.

Former Minister  Vanama Venkateswara Rao  Decidest To not Attend  Telangana Assembly Session lns
Author
First Published Aug 3, 2023, 9:58 AM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు  మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉండననున్నారు.  గత నెలలో  వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  వనమా వెంకటేశ్వరరావు  సవాల్ చేశారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి  వనమా వెంకటేశ్వరావు విజయం సాధించారు.బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన జలగం వెంకటరావుపై  వనమా వెంకటేశ్వరరావు  4 వేలకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.

ఎన్నికల అఫిడవిట్ లో  వనమావ వెంకటేశ్వరరావు ఆస్తులు, కేసులను  పొందుపర్చలేదని  2019లో  జలగం వెంకటరావు  హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. తప్పుడు  సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావును  అనర్హుడిగా ప్రకటించాలని  హైకోర్టును కోరారు. అయితే  ఈ విషయమై ఇరు వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు  ఈ ఏడాది జూలై  25న  వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటేసింది.  జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.  హైకోర్టు తీర్పు కాపీని  జలగం వెంకటరావు జూలై  26న  అసెంబ్లీ సెక్రటరీ,  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజుకు అందించారు.

 ఇదిలా ఉంటే  ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వరరావు  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే  స్టే ఇచ్చేందుకు  హైకోర్టు నిరాకరించింది.  దీంతో  సుప్రీంకోర్టులో  తెలంగాణ హైకోర్టు తీర్పును  మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు  సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరగనుందో రేపు తేలే అవకాశం ఉంది. 

also read:తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత

ఇవాళ్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని  వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉండాలని  నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు  జలగం వెంకటరావు  ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. ఈ విషయమై  స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.2018లో  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు  ప్రస్తుతం  బీఆర్ఎస్ లో ఉన్నారు.  జలగం వెంకటరావు కూడ  బీఆర్ఎస్ లో  ఉన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios