హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మాదాడి నర్సింహారెడ్డి గురువారం నాడు మృతి చెందారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నారు. హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో  మాదాడి నర్సింహారెడ్డి కన్నుమూశారు.

భూపాలపల్లి  జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి ఆయన స్వంత ఊరు.  మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు  మాదాడి నరసింహారావు సన్నిహితుడు.వీరిద్దరూ సుదీర్ఘంగా రాజకీయాల్లో  కొనసాగారు. గ్రామ సర్పంచ్ గా  మాదాడి నరసింహారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1962లో మొట్లపల్లి సర్పంచ్‌గా  తొలుత బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఆయన వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా పని చేశారు. 1985, 1989లో శాయంపేట అసెంబ్లీ స్థానం నుండి ఆయన విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా పని చేశారు. 1999లో శాయంపేట టికెట్‌ కొండా సురేఖకు దక్కడంతో అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

మాదాడి నరసింహారెడ్డికి ముగ్గురు పిల్లలు. చిన్న కొడుకుకుమారుడు, కుమార్తె అమెరికాలో వైద్యులుగా పనిచేన్తున్నారు.పెద్ద కొడుకు తండ్రితోనే  ఉంటున్నారు. గ్రామంలోని తన భూమిని పేదలకు పంచాడు. గ్రామంలోని 49 మంది నిరుపేద దళితులకు 49 ఎకరాల సాగు భూమిని ఇచ్చాడు. మాదాడి నరసింహారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్  ఆదేశాలు జారీ చేశారు.