అప్పుడు కుడి భుజం, ఇప్పుడు దయ్యమెలాయ్యాను?: కేసీఆర్ కు ఈటల ప్రశ్న

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కొత్తపల్లిలో ఆదివారం నాడు ఈటల రాజేందర్  పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తాను చేసిన కృషిని ఆయన వివరించారు. ఒకనాడు కేసీఆర్ కు కుడిభుజం, ఎడమ భుజంగా ఉన్న తాను ఇవాళ దయ్యమెలాయ్యానని ఆయన ప్రశ్నించారు.

Former minister Etela Rajender comments on KCR lns

వరంగల్:ఈటల రాజేందర్ ఒక్కడి బొండిగె పిసికేస్తే పదేళ్ల దాకా తనను అడిగేవాడు లేడని కేసీఆర్ అనుకుంటున్నాడు. కానీ మీరు నా బొండిగె పిసకనిస్తారా ? నన్ను సంపుకుంటరా, సాదుకుంటారా? మీ చేతుల్లోనే ఉందని  ఆయన ప్రజలను కోరారు.
 వరంగల్ అర్బన్ జిల్లా  కమలాపూర్ మండలం కొత్తపల్లిలో ఈటల రాజేందర్  ఆదివారం నాడు పాదయాత్ర సభలో ఆయన  ప్రసంగించారు.  తనతో పాటు 20 ఏళ్లుగా ఉన్న నాయకులను ఇప్పుడు తన వెంట లేకుండా చేశారన్నారు. కానీ ఇంతకాలం నా వెంట ఉండి... వీళ్లందరూ అటువైపు పోయారన్నారు. నిజంగా తన తప్పుంటే చెప్పి పోయినా బాగుండేది. నేను మంచోన్నో, చెడ్డోన్నో చెప్పాలి కదా అని ఆయన ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేగా రాజీనామా చేయవద్దని  తనకు చాలా మంది  చెప్పారన్నారు. కేసీఆర్ రాష్ట్ర మంతా వదిలేసి నీవెంటే పడుతారని నాకు మిత్రులు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.అనుకున్నట్లుగానే ఇప్పుడు నావెంట నాయకులంతా పడ్డారు. వందల కోట్లు డబ్బులు దిగాయని ఆయన ఆరోపించారు.మూడేళ్లుగా రాని స్కీంలన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయన్నారు.

ఎన్నడూ లేని విధంగా నేత కార్మికులకు కూడా పది లక్షలు ఇంటింటికి ఇస్తారట. తన మీద కసి ఉండొచ్చు,  నన్ను ఓడించేందుకే ఇవన్నీ చేస్తున్నా... నా ప్రజలకు మేలు జరుగుతుందంటే సంతోషిస్తానన్నారు. ఇప్పుడు పదిలక్షలు ఒక్క హుజురాబాద్ కే ఇచ్చి... యావత్ రాష్ట్రంలోని దళితుల బిడ్డల కళ్లలో మట్టి కొట్టొద్దని ఆయన కోరారు.  

తాను కుడిభుజమని, ఎడమభుజమని, తమ్ముడని, పోరాట యోధుడినని పొగిడిన కేసీఆర్ కు తాను  దయ్యమెట్లా అయ్యానో అర్ధం కావడం లేదన్నారు. కరోనా సమయంలో భార్యా పిల్లలను వదిలేసి ఇంటికి కూడా వెళ్లకుండా కోట్ల మంది ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే వాళ్ల చుట్టూ తిరిగానని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

కరోనా సమయంలో నేను పనిచేస్తే మంచి పేరొచ్చిందన్నారు.  అసెంబ్లీలో రాజాసింగ్, ఓవైసీ లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని తిట్టలేక ఒక్క రాజేందర్ గొప్పగా పనిచేస్తున్నాడని చెప్పారని ఆయన ప్రస్తావించారు. అక్కడే వాళ్ల కళ్లు కుట్టాయి. అక్కడే ఈ గొడవ స్టార్టైందన్నారు.
వాళ్ల కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నారు. అయినా నేనేమీ అడ్డం రాలేదన్నారు.

తాను  ధర్మం తప్పని మనిషినని ఆయన చెప్పారు. పేదల  భూమిని ఎలా ఆక్రమించుకొంటానని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎకరం భూమి ఆక్రమించుకొన్నా ముక్కు నేలకు రాస్తానని తన భార్య ప్రకటన చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.నీ అధికారులతో విచారించి నిజాలు తేల్చుకోవచ్చు కదా అని ఆయన కేసీఆర్ ను కోరారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios