హైదరాబాద్ లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మాజీమంత్రి అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు అఖిలప్రియ ఫాంహౌస్‌ వాచ్‌మెన్‌ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, ఆయన సోదరుడు చంద్రహాస్‌ పరారీలో ఉన్నారు.

హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ సమీప బంధువులు ముగ్గురు కిడ్నాప్‌కు గురయ్యారు. ప్రవీణ్‌, నవీన్, సునీల్‌లను నార్సింగిలో వదిలి కిడ్నాపర్లు పారిపోయారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. వికారాబాద్‌లో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాఫీజ్‌పేటలోని భూవివాదమే కిడ్నాప్‌కు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.