వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఖమ్మం : లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ (65) గురువారం తన ఇంట్లోని పిండిమిల్లును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీరమరలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె చీరతో పాటుగా పిండిమరలోకి జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే జీవనాధారమైన పిండిమిల్లే చౌడమ్మ ప్రాణం తీయడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అన్నపురెడ్డిపల్లి లో మరో విషాదం చోటు చేసుకుంది. డ్రిల్లింగ్ పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజుపురం గ్రామానికి చెందిన చింతల రాజు (32) గురువారం ఎర్రగుంటలోని ఓ పాత భవనం పిల్లర్లను తొలగించే పనికి వెళ్లాడు. డ్రిల్లింగ్ మిషన్ తో ఇనుప చువ్వలను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి సోమమ్మ కన్నీరుమున్నీరుగ విఫలించింది. ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.