సూర్యాపేట జిల్లాలోని  సిమెంట్  ఫ్యాక్టరీలో జరిగిన  ప్రమాదంలో  ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.


సూర్యాపేట: జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో  మంగళవారంనాడు ప్రమాదం  జరిగింది.ఈ ఫ్యాక్టరీలోని   యూనిట్ -4లో లిఫ్ట్ జారి పడి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారంతా ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వాసులుగా గుర్తించారు.500 అడుగుల ఎత్తులో  కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్న సమయంలో లిఫ్ట్ కూలి ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.  గాయపడిన కార్మికులు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.