మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు. సికింద్రాబాద్ నాచారం పోస్ట్ ఆఫీస్ వెనుక వైపున ఉన్న ఇంట్లో మసాజ్ పార్లర్ నడుపుతున్నారు. 

ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందంటూ ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు సదరు మసాజ్ పార్లర్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు.

దాడిలో భాగంగా ముగ్గురు మహిళలను రక్షించి.. స్పా యజమాని శ్రీరామ్‌, సిబ్బంది మణికంఠ, రాజేశ్‌లతో పాటు కస్టమర్లు నాగేశ్వరరావు, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ.7,570 నగదు, నాలుగు బిల్లు పుస్తకాలు, క్యాట్‌లాగ్, ఆరు సెల్‌ఫోన్లు, మూడు రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.