Asianet News TeluguAsianet News Telugu

బయోడైవర్శిటీ ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ప్రారంభం: తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు

బయోడైవర్శిటీ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ను గురువారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

First level flyover at Biodiversity junction launches today
Author
Hyderabad, First Published May 21, 2020, 11:47 AM IST


హైదరాబాద్: బయోడైవర్శిటీ జంక్షన్ లో నిర్మిస్తున్న ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ ను గురువారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

గచ్చిబౌలి నుండి మెహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.బయోడైవర్సిటీ లెవల్‌-1 ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.30.26కోట్లు ఖర్చు చేశారు. దీని పొడవు 690 మీటర్లు, వెడల్పు 11.50 మీటర్లు. ఇది మూడు లేన్లుగా నిర్మించారు. 

ఈ ఫ్లై ఓవర్ పై 40 కి.మీ వేగంతోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు మరింత వేగంగా ప్రయాణం చేయకూడదని ఆంక్షలను విధించారు. 
సిగ్నల్ ఫ్రీ గా గచ్చిభౌలి- టోలిచౌకి ఫ్లైఓవర్ ఉండనుంది. దీంతో వాహనదారుల కష్టాలు తీరనున్నాయని అధికారులు చెప్పారు. 

ఈ ఫ్లైఓవర్‌ పూర్తికావడంతో ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-4 కింద రూ.379కోట్ల అంచనా వ్యయంతో జేఎన్‌టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12కిలోమీటర్ల కారిడార్‌లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి.

ఈ ప్యాకేజీలో భాగంగా మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్‌, మైండ్‌స్పేస్‌ ఫ్లైఓవర్‌, అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్‌, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌ లెవెల్‌-2 ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ లెవల్‌-1 ఫ్లైఓవర్‌ తదితర ఆరు ప్రాజెక్టులు చేపట్టారు.ఇందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios